---Advertisement---

మహిళా ఎస్‌ఐ ఘటనలో అసలు నిజం ఇదే.. చింతాడ రవికుమార్ వీడియోతో సంచలన విషయాలు వెలుగులోకి!

July 31, 2026

Summarize with AI

---Advertisement---

శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటన సందర్భంగా మహిళా ఎస్‌ఐ (Woman SI) ప్రవల్లికతో (Pravallika) జరిగిన ఘటనపై తీవ్ర వివాదం నెలకొంది. ఈ ఘటనను కొంతమంది పోలీసులు, ఒక వర్గం మీడియా చూపిస్తున్న తీరు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అస్పష్టంగా ఉన్న వీడియో క్లిప్‌ను ఆధారంగా చేసుకుని కథనాలు అల్లుతూ, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆముదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ (Chintada Ravikumar) వీడియో విడుదల చేసి తన వైపు వాదనను వెల్లడించారు. జగన్ పర్యటనకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడాన్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం (Coalition Government) రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు.

జగన్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో ప్రమాదం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో బూర్జ పోలీస్‌ స్టేషన్ ఎస్‌ఐ ప్రవల్లికను కేవలం పక్కకు వెళ్లాలని మాత్రమే కోరానని రవికుమార్ తెలిపారు. ఆమె తనకు ముందే పరిచయం ఉన్న అధికారిణి అని, ఆ సమయంలో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. భారీగా “జై జగన్”(Jai Jagan) నినాదాలు వినిపించడంతో ఆమె చెవులు మూసుకున్నారని, ఆ పరిస్థితిలో ఆమెకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్లామని వివరించారు.

అయితే ఈ ఘటనను వక్రీకరించి తనపై 109, 189, 191, 221, 121, 74, 79, 351, 119 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నం, కుట్ర వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా చేర్చడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని విమర్శించారు.

తాను ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ(PHD) పూర్తి చేశానని, ఎల్‌ఎల్‌బీ (LLB) కూడా చదివానని, చట్టంపై పూర్తి అవగాహన ఉన్న తనపై ఇలాంటి కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని రవికుమార్ అన్నారు. అక్రమ కేసులకు తాను భయపడబోనని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో విడుదల చేశానని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment