---Advertisement---

వేతనాల పెంపు కోసం స్కీం వర్కర్ల రాష్ట్రవ్యాప్త పోరు.. కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్తత.

July 31, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ (Anganwadi), ఆశా(ASHA), మధ్యాహ్న భోజన పథకం(Mid-Day Meal Scheme), విఓఏలు(VOAs), ఆర్‌పీలు(RPs), స్కూల్ స్వీపర్లు(School Sweepers), సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, వెలుగు తదితర విభాగాలకు చెందిన స్కీం వర్కర్లు 27 జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కనీస వేతనాన్ని రూ.26,000కు పెంచడంతో పాటు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే అంగన్‌వాడీలకు అమలు చేస్తున్న నవచేతన యాప్‌ను (Navachetana App) రద్దు చేయాలని, ఆశా వర్కర్ల పనిభారం తగ్గించాలని, మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధికి భంగం కలిగించే స్మార్ట్ కిచెన్లను (Smart Kitchens) ఉపసంహరించాలని, విఓఏలు, ఆర్‌పీలు, స్కూల్ స్వీపర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఏలూరు కలెక్టరేట్ వద్ద పోలీసుల అడ్డంకులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అనకాపల్లి జిల్లాలో జరిగిన నిరసనలో లాఠీచార్జ్ జరిగినట్లు నిర్వాహకులు ఆరోపించారు. ఈ ఘటనలో విఓఏ రాష్ట్ర అధ్యక్షురాలు సి.హెచ్. రూపాదేవికి (C.H. Roopa Devi) ఫ్రాక్చర్ కాగా, మరికొందరు గాయపడినట్లు తెలిపారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది స్కీం వర్కర్లు నిరసనలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తోపులాటలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావుతో (Tejeswara Rao) పాటు అంగన్‌వాడీ నాయకులు అరెస్టైనట్లు సమాచారం. సత్యసాయి, కడప, తిరుపతి, ఏలూరు జిల్లాల్లో కూడా పోలీసులతో తోపులాటలు చోటుచేసుకున్నాయి.

ఎన్‌టీఆర్ జిల్లాలో జరిగిన ధర్నాలో అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మ (K. Subbaraovamma) పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో నిరసనకారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కీం వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment