---Advertisement---

ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటరు జాబితా విడుదల.. రాష్ట్ర సీఈవో వెబ్‌సైట్‌లో లిస్ట్!

July 31, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో(SIR Process)భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం(EC) 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు (Assembly Constituencies) సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను (Draft Voter List) విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్‌ యాదవ్‌ (Vivek Yadav) ఈ జాబితాను విడుదల చేస్తూ కీలక వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 89.22 శాతం, అంటే 3.71 కోట్ల మంది ఎన్యూమరేషన్‌ ఫారాలను (Enumeration Forms) సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియలో 15.22 లక్షల మంది మృతులుగా, 22.30 లక్షల మంది శాశ్వతంగా చిరునామా మార్చినట్లు లేదా గైర్హాజరైనట్లు, అలాగే 7.37 లక్షల మంది పేర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నమోదైనట్లు గుర్తించినట్లు వివరించారు.

ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదైన వారి పేరును ఒకే చోట మాత్రమే కొనసాగిస్తామని సీఈవో స్పష్టం చేశారు. నిజమైన ఓటర్లు ఎవరైనా జాబితాలో లేకపోతే ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలను స్వీకరిస్తామని, అనంతరం పరిశీలన పూర్తిచేసి అక్టోబర్‌ 3న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.

ముసాయిదా ఓటరు జాబితాను ఈసీఐ నెట్‌ యాప్‌ (ECI Net App) మరియు రాష్ట్ర సీఈవో వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని సూచించారు. అలాగే నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్‌ కాకుండా, అనర్హులు చేరకుండా పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని సీఈవో వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment