---Advertisement---

Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే విజయం.. భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తాం..!

July 31, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేశామని, రానున్న ఎన్నికల్లో ఇది పార్టీకి మరింత బలంగా ఉపయోగపడుతుందని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, వైఎస్ జగన్ (YS Jagan) సందేశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

వైసీపీకి అధికారమే లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమమే పార్టీ ప్రధాన అజెండా అని సజ్జల స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆలోచనల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా రంగు మార్చే నాయకుడు కాదని, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకుడిగా జగన్‌ను అభివర్ణించారు.

చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాజకీయాలు అధికారం కోసం సాగుతుంటే, వైసీపీ రాజకీయాలు ప్రజల కోసం కొనసాగుతాయని సజ్జల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కొన్ని వర్గాలు మీడియా ద్వారా ప్రజల్లో భ్రమలు సృష్టించాయని, ఇప్పుడు సోషల్ మీడియా నేరుగా ప్రజలతో మమేకమయ్యే అత్యంత శక్తివంతమైన వేదికగా మారిందన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే భారీ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలోకి (Power) వస్తుందనే పూర్తి విశ్వాసం తమకు ఉందని తెలిపారు.

పార్టీ కార్యకర్తల త్యాగాలు, కష్టపడి చేసిన పోరాటం వల్లే వైసీపీ ఈ స్థాయిలో నిలబడగలిగిందని సజ్జల కొనియాడారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా జగన్ ముందుండి పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, ఒక్క పంచాయతీని కూడా పోటీ లేకుండా వదిలే పరిస్థితి ఉండదని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల జగన్ నిర్వహించిన పర్యటనలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని సజ్జల పేర్కొన్నారు. పేదలకు ఉపయోగపడని రాజకీయాలకు జగన్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి (State Development) కోసం భారీ పరిశ్రమలు(Industries), పోర్టులు(Ports), మౌలిక సదుపాయాల (Infrastructure) కల్పనపై దృష్టి పెట్టాలని, కేవలం పైపై కనిపించే అభివృద్ధితో ప్రజలకు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేసిన సజ్జల, వైఎస్ జగన్ చెప్పే అంశాలను చిన్న చిన్న వీడియోలు, క్యాప్సూల్స్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసే ప్రచారకుడిగా వ్యవహరించాలని కోరారు. అసభ్య పోస్టులు, వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ కమ్యూనికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment