వైసీపీ (YSRCP) మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి (Nandamuri Lakshmi Parvathi) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. భువనేశ్వరి మాట్లాడిన ప్రతి మాట కూడా పచ్చి అబద్ధమని (Blatant Lie) ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో తనను అవమానించారని, వ్యక్తిత్వ హననం చేశారని భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఆమె పూర్తిగా ఖండించారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని, ఆమెపై ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చింది ఆమె భర్త చంద్రబాబు, కుమారుడు లోకేశేనని (Lokesh) లక్ష్మీపార్వతి విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల (Political Benefits) కోసం కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావడం సరికాదని లక్ష్మీపార్వతి అన్నారు. తమపై ఆరోపణలు చేసే ముందు తమ ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలని సూచించారు. ఇతరులపై నిందలు వేయడం కంటే, తమ కుటుంబ సభ్యుల వ్యవహారశైలిని పరిశీలించాలని ఆమె వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో తనను అవమానించారనే ఆరోపణలను నిరూపించగలరా అంటూ లక్ష్మీపార్వతి సవాల్ విసిరారు. ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటిని నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. మొదటి నుంచి చంద్రబాబు (Chandrababu Naidu) రాజకీయ ప్రయోజనాల కోసం భువనేశ్వరిని ఉపయోగించుకుంటున్నారని, ఇప్పుడు అదే బాటలో లోకేశ్(Lokesh) కూడా నడుస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ కుటుంబ మహిళలపై (YSR Family Women) సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు(Abusive Posts), ట్రోలింగ్ (Trolling) జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. మీ భర్త, మీ కుమారుడు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. ముందు మీ కుమారుడికి సంస్కారం నేర్పించాలని నారా భువనేశ్వరికి సూచించారు.







