---Advertisement---

భోగాపురం పేరుతో క్రెడిట్ రాజకీయాలా?.. ‘కుప్పం ఎయిర్‌పోర్టు ఏమైంది బాబు?’ అంటూ అమర్నాథ్ కౌంటర్!

August 2, 2026

Summarize with AI

---Advertisement---

భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu Naidu) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు (Foundation Stones) చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేసిన ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి క్రెడిట్‌ను (Credit) చంద్రబాబు తీసుకోవడం సరికాదన్నారు.

విశాఖలో (Visakhapatnam) మీడియాతో మాట్లాడిన అమర్నాథ్, భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి శుభపరిణామమని పేర్కొన్నారు. నిర్మాణాన్ని పూర్తి చేసిన జీఎంఆర్ సంస్థకు (GMR Company) అభినందనలు తెలిపారు. అయితే, ప్రధానమంత్రి సమక్షంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైఎస్ జగన్‌పై (YS Jagan) విమర్శలు చేయడం తగదని అన్నారు. ప్రధానికి కూడా అసత్యాలు చెబితే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసలు కృషి వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని (YS Jagan Government) అమర్నాథ్ పేర్కొన్నారు. 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పటికీ అప్పటివరకు కేవలం 270 ఎకరాల భూమి మాత్రమే సేకరించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జీఎంఆర్‌తో ఒప్పంద ప్రక్రియ పూర్తై, 150కు పైగా న్యాయ వివాదాలను పరిష్కరించి, సుమారు 2,700 ఎకరాల భూసేకరణ (Land Acquisition) పూర్తి చేసి పనులను వేగవంతం చేసిందని తెలిపారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని, అప్పుడే 2026లో ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతుందని ప్రకటించారని గుర్తుచేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీఎంఆర్ ప్రతినిధులను మాట్లాడనివ్వకపోవడంపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు లేవనెత్తారు. వారు మాట్లాడితే వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతో అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

అలాగే, భోగాపురం ఎయిర్‌పోర్టుకు క్రెడిట్ తీసుకుంటున్న చంద్రబాబు, 2019లో శంకుస్థాపన చేసిన కుప్పం ఎయిర్‌పోర్టు పరిస్థితి ఏమైందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చంద్రబాబు చేసిన కృషి ఏమిటో వివరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ(YSRCP) పాలనలోనే ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందని, చంద్రబాబు మాత్రం ఆ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారని విమర్శించారు.

చివరగా, రాష్ట్రంలో రాజ్యాంగ పాలన కంటే “రెడ్ బుక్”(Red Book), “గిన్నిస్ బుక్”(Guinness Book), “ఫేస్ బుక్”(Face Book) పాలన నడుస్తోందని ఎద్దేవా చేసిన అమర్నాథ్, “ఎవరికో పుట్టిన బిడ్డకు చంద్రబాబు ఘనంగా బారసాల చేసినట్టుగా భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ తీసుకుంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment