వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో (Nalgonda) జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో (Highest Majority) గెలిపిస్తామని నల్లగొండ ప్రజలు హామీ (People Promise) ఇస్తేనే తాను వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అలాంటి స్పష్టమైన మద్దతు లేకపోతే ఎన్నికల పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఎన్నికల సమయంలో తాను స్వయంగా ప్రచారానికి రాకపోయినా.. ఇప్పటి వరకు నల్లగొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలనే (Welfare Programs) చూసి ప్రజలు ఓటు(Vote) వేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. వ్యక్తిగత ప్రచారం కంటే పనితీరుకే ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం, వ్యక్తిగత ఆస్తుల (Personal Assets) గురించి కూడా మంత్రి స్పందించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసినా ఇప్పటికీ తన పేరుపై సొంత ఇల్లు (Own House) లేదని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ అద్దె ఇంట్లోనే (Rented House) నివసిస్తున్నానని, పూర్వీకుల నుంచి వచ్చిన భూమి తప్ప తాను సంపాదించిన అదనపు ఆస్తులేవీ లేవని చెప్పారు.
నల్లగొండ అభివృద్ధే తన లక్ష్యమని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల సేవకే అంకితమై పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.






