బీజేపీ ఎంపీ(BJP MP) ఈటల రాజేందర్ (Etala Rajender) మరోసారి హైడ్రాపై (HYDRA) తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను (People) వేధించే సంస్థగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అధికారులను నియమించే హక్కు ఉండొచ్చని, కానీ ప్రజల ఇళ్లను (People’s Houses) కూల్చివేసే (Demolish) అధికారం లేదని స్పష్టం చేశారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని పేర్కొంటూ, హిట్లర్ ప్రపంచానికి ఎంతటి విధ్వంసాన్ని తీసుకొచ్చాడో అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పుడు అదే తరహాలో హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈటల మాట్లాడుతూ హైడ్రా అనేది పేదల ఇళ్లను కూల్చివేసే సంస్థగా ప్రజల్లో అభిప్రాయం ఏర్పడిందన్నారు. దాదాపు 40 నుంచి 50 ఏళ్ల క్రితం తెలంగాణలోని (Telangana) పలు ప్రాంతాల నుంచి వచ్చి చెరువులు, కాలువల పక్కన కష్టపడి ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాల నివాసాలను కూడా కూల్చివేశారని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి భూములు కట్టబెట్టడం, వ్యతిరేకంగా ఉన్న వారిపై ఒత్తిడి తీసుకురావడానికే హైడ్రాను ఉపయోగిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్‌లో (Hyderabad) హైడ్రా చర్యల కారణంగా ప్రజలు ఇళ్లు కొనాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడిందని ఈటల పేర్కొన్నారు. రెవెన్యూ, మున్సిపల్, హోం శాఖల కంటే హైడ్రా ఒక సుప్రీం డిపార్ట్మెంట్‌లా వ్యవహరిస్తోందని అన్నారు. కోర్టుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని, చివరికి సీఎం రేవంత్ రెడ్డి మాటను కూడా హైడ్రా వింటుందా లేదా అనే అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.






