---Advertisement---

జగన్ కేటాయించిన భూమిలోనే లోకేష్ మరోసారి శంకుస్థాపన.. పీవీ సింధు అకాడెమీ క్రెడిట్ ఎవరిది?

August 5, 2026

Summarize with AI

---Advertisement---

బ్యాడ్మింటన్‌లో  (Badminton) ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటిన పీవీ సింధును  (PV Sindhu) ప్రోత్సహించేందుకు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం(YSRCP Government) విశాఖపట్నంలోని  (Visakhapatnam) తోటగరువులో బ్యాడ్మింటన్ అకాడెమీ  (Badminton Academy) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ హామీకి అనుగుణంగా 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  (YS Jagan Mohan Reddy) అత్యంత విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని అకాడెమీ కోసం కేటాయించారు. అనంతరం అకాడెమీ విస్తరణకు మరింత స్థలం అవసరమని పీవీ సింధు కోరడంతో మరో ఎకరం అదనంగా మంజూరు చేశారు. దీంతో మొత్తం 3 ఎకరాల భూమిలో ‘సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’ (Centre for Badminton and Sports Excellence) ప్రాజెక్టుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగింది.

అకాడెమీ నిర్మాణం ఆలస్యమవుతుందనే కారణంతో ఆ స్థలాన్ని జూనియర్ కాలేజీకి కేటాయించాలని అప్పట్లో టీడీపీ(TDP) నాయకులు డిమాండ్ చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 7న పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి అదే స్థలంలో బ్యాడ్మింటన్ అకాడెమీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

తాజాగా అదే భూమిలో రెండేళ్ల తరువాత మంత్రి నారా లోకేష్(Nara Lokesh) శంకుస్థాపన (Foundation Stone) రాయి వేయడం, అకాడెమీ ఏర్పాటుకు తమ ప్రభుత్వమే ప్రధాన కారణమనే విధంగా ప్రచారం జరగడం రాజకీయ చర్చకు దారితీసింది. 2021లో భూమి కేటాయింపు నుంచి 2024లో భూమి పూజ వరకు తమకు ఎలాంటి పాత్ర లేకపోయినా, ఇప్పుడు ప్రాజెక్టు క్రెడిట్‌ను  (Project Credit) తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు (Development Projects) కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వేళ, జగన్ ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే మరోసారి శంకుస్థాపన నిర్వహించి ప్రచారం చేసుకోవడం కూడా అదే ధోరణిలో భాగంగా కనిపిస్తోందని పలువురు క్రీడాభిమానులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment