---Advertisement---

ప్రతిపక్ష ప్రశ్నలకు కూటమి సమాధానం… భౌతిక దాడులేనా?

August 6, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రశ్నలకు విధానపరమైన సమాధానాల కంటే భౌతిక దాడులు, బెదిరింపులే ప్రత్యుత్తరంగా మారుతున్నాయనే విమర్శలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ప్రభుత్వం “రెడ్ బుక్”(RED Book) పాలనను ప్రారంభించిన నాటి నుంచే రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు.

డీఎస్సీ పరీక్షల్లో (DSC Examinations) జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ (CBI Investigation) కోరుతూ విజయవాడ ముత్యాలపాడులో యువత, వైసీపీ(YSRCP) నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (Malladi Vishnu) చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) బోండా ఉమా (Bonda Uma) తన అనుచరులతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకుని శిబిరాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనలో వైసీపీ నాయకులపై కోడిగుడ్లతో దాడులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీక్షా శిబిరంపై అత్యంత అవమానకరంగా టాయిలెట్ పోశారనే ఆరోపణలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న వారిపై ఇలాంటి చర్యలు నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే తరహాలో గత కొంతకాలంగా వైసీపీ(YSRCP) నాయకులు, వారి నివాసాలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరిగాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, పెర్ని నాని, వల్లభనేని వంశీ, ముద్రగడ పద్మనాభం, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరుల ఇళ్లపై దాడులు జరిగాయని పేర్కొంటోంది. అలాగే హిందూపురం వైసీపీ కార్యాలయం, మార్గాని భరత్ కార్యాలయం, నంబూరి శంకరరావు కార్యాలయం, డెక్కన్ క్రానికల్, సాక్షి కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విడదల రజిని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులపై కూడా దాడి ప్రయత్నాలు జరిగాయని ప్రతిపక్షం చెబుతోంది.

ప్రజాస్వామ్యంలో (Democracy) ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంటుందని, విమర్శలను భౌతిక దాడులతో అణిచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. భయపెట్టి, గొంతు నొక్కి రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు చేయదని హెచ్చరిస్తున్నారు. “రూల్ ఆఫ్ లా”(Rule of Law) పేరుతో పాలన సాగుతోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, ఈ తరహా ఘటనలు అదే సూత్రానికి అనుగుణంగా ఉన్నాయా అనే ప్రశ్నలను వారు లేవనెత్తుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment