తెలంగాణ రాష్ట్ర సాధన (Telangana State Formation) కోసం ఆచార్య జయశంకర్ (Professor Jayashankar) తన జీవితాన్నే అంకితం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్(KCR) పోరాటం, జయశంకర్ ఆరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని, కనీసం “జై తెలంగాణ”(“Jai Telangana”) అని కూడా చెప్పని వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్ధిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా “జై తెలంగాణ” అనలేదని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల కోసం జరిగిన పోరాటమని గుర్తు చేసిన హరీశ్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం Congress Government) అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచినా రాష్ట్ర ప్రాజెక్టులకు ఒక్క కొత్త అనుమతి కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు. గతంలో 18 సార్లు జీఆర్ఎంబీ సమావేశాలు (GRMB Meetings) జరిగినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తెలంగాణ ప్రాజెక్టులను (Telangana Projects) వ్యతిరేకించినా, అప్పటి తెలంగాణ ప్రభుత్వం అన్ని అభ్యంతరాలను తిప్పికొట్టి అవసరమైన అనుమతులు సాధించిందన్నారు. కానీ ఇప్పుడు ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులను కూడా రద్దు చేసి రివ్యూ చేయాలనే అంశాన్ని జీఆర్ఎంబీ అజెండాలో చేర్చడం చరిత్రలోనే మొదటిసారి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ప్రాజెక్టులు, సాగునీటి అంశాలపై (Irrigation Issues) కనీస చిత్తశుద్ధి లేదని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి జీఆర్ఎంబీ అజెండాను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే ఆ సమావేశాన్ని వెంటనే బహిష్కరించాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు.
సమ్మక్క సారక్క (దేవాదుల) ప్రాజెక్టుకు (Samakka Sarakka Devadula Project) 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ (Hydrology Clearance) వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఎందుకు వదులుకుంటోందని హరీశ్ రావు నిలదీశారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రహస్య ఒప్పందం చేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట ఈ అంశం అజెండాలో లేదని చెప్పి, తర్వాత ఢిల్లీ సమావేశంలో చేర్చారని, సమావేశానికి హాజరుకామని చెప్పి చివరకు వెళ్లి సంతకాలు చేశారని విమర్శించారు. కోర్టుల్లో ప్రభుత్వం వేసిన పిటిషన్ల నిర్వహణ పూర్తిగా విఫలమైందని, కనీసం సరైన రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.






