---Advertisement---

దేవరపల్లి టిఫిన్ సెంటర్ అంశం.. టీడీపీకి బూమరాంగ్ అయిన రాజకీయం.

August 6, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దేవరపల్లి పర్యటన (Devarapalli Visit) సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. గోదావరి జిల్లాల్లో (Godavari Districts) జగన్‌కు లభించిన ఈ స్థాయి ప్రజా స్పందన అధికార కూటమిని, దానికి మద్దతుగా నిలిచే మీడియాను ఆశ్చర్యానికి గురి చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ స్థాయి జనసందోహంపై ముందస్తు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వానికి అందలేదా అనే ప్రశ్నలు సైతం అధికార పార్టీలోనే వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ భారీ ప్రజా స్పందన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ(YSRCP) ఆరోపిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని తెలిసినా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ కారణంగా చోటుచేసుకున్న తోపులాటలను రాజకీయ ప్రచారానికి వాడుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దేవరపల్లిలోని దివ్య(Divya) అనే మహిళ(Women) నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్‌లోకి (Tiffin Center) చొరబడి సామాగ్రి ధ్వంసం చేశారని, నగదు తీసుకెళ్లారని, మహిళలు, పిల్లలపై దాడికి పాల్పడ్డారని, దాదాపు రూ.10 వేల నష్టం కలిగించారని కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు ప్రసారం చేశాయి. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)కూడా స్పందిస్తూ, నిరుపేద మహిళ టిఫిన్ సెంటర్‌లోకి చొరబడి సామాగ్రితో పాటు హిందూ దేవుళ్ల (Hindu Gods) చిత్రాలను కూడా ధ్వంసం చేశారని తన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. దీంతో ఈ ఘటనకు మతపరమైన కోణం జోడించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరిగిందనే విమర్శలు వినిపించాయి.

అయితే ఘటన అనంతరం టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు దివ్య విడుదల చేసిన వీడియో ఈ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. తాము ఎక్కడా జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని, జనసందోహంలో జరిగిన తోపులాటను ఆయనపై మోపడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. తమ కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందని, ఆయనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.

అంతేకాకుండా, ఈ ఘటనపై తమతో బలవంతంగా ప్రకటన చేయించాలని కొందరు టీడీపీ(TDP) నాయకులు ఒత్తిడి చేశారని, తమ షాపులో పెద్ద విధ్వంసం జరిగినట్లు చెప్పాలని కోరారని ఆమె ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్‌ను కలవాలని, ప్రభుత్వం పంపే కారులో రావాలని చెప్పడంతో భయపడ్డామని కూడా పేర్కొన్నారు. జగన్ హయాంలో తమకు ఇంటి స్థలం లభించిందని, ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మేలు జరిగిందని, ఈసారి జగన్‌ను ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

ఈ ఘటనను ఉదాహరణగా చూపుతూ, భద్రతా లోపాల వల్ల జరిగిన తోపులాటను ప్రతిపక్ష నాయకుడిపై మోపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. మరోవైపు, దేవరపల్లి పర్యటనలో ప్రధానంగా పొగాకు రైతుల సమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా, ఆ అంశంపై ప్రభుత్వం స్పందించకుండా ఈ వివాదాన్ని రాజకీయ ప్రచారానికి వినియోగించుకోవడం సమంజసం కాదని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment