---Advertisement---

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమిలేయర్ వర్తించదు..సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ.!

August 7, 2026

Summarize with AI

---Advertisement---

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు (SC, ST Reservations) క్రీమిలేయర్ విధానాన్ని (Creamy Layer Policy) వర్తింపజేయలేమని కేంద్ర ప్రభుత్వం (Central Government) సుప్రీంకోర్టుకు (Supreme Court) స్పష్టం చేసింది. ఇతర వెనుకబడిన వర్గాల్లో అమలవుతున్న క్రీమిలేయర్ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మెరుగైన స్థితిలో ఉన్నవారిని గుర్తించి రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి మినహాయించేందుకు క్రీమిలేయర్ విధానాన్ని (Creamy Layer) అమలు చేస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.

ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, సామాజిక వెనుకబాటుతనం ఇతర వెనుకబడిన వర్గాలతో పోలిస్తే భిన్నమైనవని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అందువల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమిలేయర్ పరిమితిని విధించడం సరికాదని స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంతో పాటు వారి సామాజిక సాధికారతను కొనసాగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానాన్ని (Creamy Layer) అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment