---Advertisement---

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం!

October 7, 2026

Summarize with AI

---Advertisement---

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) భారీ ప్రమాదం (Major Accident) చోటుచేసుకుంది. సీమాపురిలో(Seemapuri) గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తులు (Three Floors) ఉన్న భవనంలోని (Building) కొంత భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు(Police), అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితులను గుర్తించి సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

భవనం కూలిపోవడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై స్పష్టత లేదు. అదే విధంగా భవనం కూలిపోవడానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది.

అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించి, లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సహాయక బృందాలు (Rescue Teams) చర్యలు కొనసాగిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment