---Advertisement---

పల్నాడులో మరో ఘోరం.. వైయస్సార్సీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య.

August 7, 2026

Summarize with AI

---Advertisement---

పల్నాడు జిల్లా (Palnadu District) రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో (Rentala Village) దారుణ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ(YSRCP) నాయకుడు నవులూరి చెన్నారెడ్డిని (Navuluri Chennareddy) గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పల్నాడు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మంద సల్మాన్(Manda Salman) హత్య, వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ హత్య (Rasheed Murder) వంటి ఘటనలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

అంతేకాకుండా, టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపుల కారణంగానే సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన నాగమల్లేశ్వరరావు(Nagamalleswara Rao), లక్ష్మీనారాయణ (Lakshminarayana) ఆత్మహత్యలకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నవులూరి చెన్నారెడ్డి (Navuluri Chennareddy) హత్య వెనుక కూడా రాజకీయ కక్షసాధింపు కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని, నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని స్థానికులు, పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment