---Advertisement---

మహిళల భద్రతకు వెన్నుపోటా? ఏపీ కేబినెట్ దిశా చట్టం రద్దు నిర్ణయంపై తీవ్ర విమర్శలు

August 7, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మహిళల భద్రతకు(Women Safety) కీలకంగా భావించిన దిశా చట్టం–2019ను(Disha Act–2019) ఉపసంహరించుకునే నిర్ణయం రాష్ట్ర కేబినెట్(State Cabinet) తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి, బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వెలువడటంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం మహిళలు(Women), బాలికలపై(Girls) జరిగే అత్యాచారాలు(Rapes), లైంగిక వేధింపులు(Sexual Harassment), యాసిడ్ దాడులు (Acid Attacks) వంటి నేరాలపై వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు అమలు చేయాలనే లక్ష్యంతో దిశా బిల్లును (Disha Bill) రూపొందించింది. ఈ బిల్లును 2019 డిసెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ శాసనసభ(Andhra Pradesh Legislative Assembly), డిసెంబర్ 16న శాసన మండలి ఆమోదించగా, 2020 జనవరి 2న రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు.

ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో నేరం రుజువైతే మరణశిక్ష విధించే అవకాశం కల్పించడంతో పాటు, ప్రత్యేక కోర్టుల (Special Courts) ద్వారా వేగవంతమైన విచారణకు మార్గం సుగమం చేయాలనే ఉద్దేశం ఉంది. అయితే రాష్ట్రపతి ఆమోద ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే బిల్లును ఉపసంహరించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

2024 ఏప్రిల్‌లో పార్లమెంట్‌లో ఎంపీ మద్దిల గురుమూర్తి (Maddila Gurumoorthy) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, సవరణలతో కూడిన దిశా బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉందని వెల్లడించారు. దిశా చట్టానికి దేశంలోని పలువురు ప్రముఖులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రశంసలు తెలిపాయి. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ చట్టాన్ని అభినందిస్తూ, ఢిల్లీలో అమలు చేసే అవకాశాలను పరిశీలించేందుకు అధికారిక ప్రతిని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దిశా చట్టం స్ఫూర్తితో శక్తి బిల్లు రూపొందించింది. కేరళ మాజీ మంత్రి కె.కె. శైలజ (K.K. Shailaja) కూడా మహిళల రక్షణకు ఈ తరహా చట్టాలను పరిశీలించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో, ఇప్పటికే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లును ముందుకు తీసుకెళ్లకుండా ఉపసంహరించుకోవడం మహిళల భద్రతకు వెన్నుపోటుగా మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మహిళలకు భరోసా కల్పించే చట్టాన్ని అమలు దిశగా తీసుకెళ్లాల్సిందిపోయి, మధ్యలోనే నిలిపివేయడం దురదృష్టకరమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

దిశా చట్టంపై ప్రజల్లో ఏర్పడిన నమ్మకానికి ఉదాహరణగా గుంటూరులో 2021లో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసును పలువురు ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో వేగవంతమైన విచారణ అనంతరం 257 రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువరించి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. ఆ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా దిశా వ్యవస్థ వల్లే త్వరగా న్యాయం జరిగిందని పేర్కొన్నారు. దిశా చట్టాన్ని ఉపసంహరించుకునే నిర్ణయం మహిళల భద్రతకు ముప్పుగా అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment