---Advertisement---

వందేమాతరం గీతానికి ‘జాతీయ గీతం’ హోదా.. చట్టానికి రాష్ట్రపతి ఆమోదం..!

August 7, 2026

Summarize with AI

---Advertisement---

భారత స్వాతంత్య్ర పోరాటంలో(Freedom Struggle) కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి భావాన్ని రగిలించిన వందేమాతరం గీతానికి (Vande Mataram Song) అత్యున్నత గౌరవం దక్కినట్లు సమాచారం. వందేమాతరం గీతానికి జాతీయ గీతంతో(National Anthem) సమానమైన అధికారిక హోదా కల్పించేలా రూపొందించిన నూతన చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చినట్లు సమాచారం.

ఈ చట్టం అమల్లోకి వస్తే వందేమాతరం గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, బహిరంగంగా అవమానించడం లేదా హేళన చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు(Government Programs), బహిరంగ సభల్లో వందేమాతరం గీతాలాపన జరుగుతున్న సమయంలో కావాలనే విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

జాతీయ గీతమైన జనగణమనకు ఇచ్చే గౌరవం, క్రమశిక్షణకు అనుగుణంగా వందేమాతరం గీతం ఆలాపన సమయంలోనూ కొన్ని నిబంధనలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. గీతం ఆలాపన సమయంలో పాటించాల్సిన గౌరవం, క్రమశిక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ చట్టం ద్వారా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం గీతానికి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది. దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జాతీయ ఐక్యతను పెంపొందించే దిశగా ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో వందేమాతరం గీతానికి మరింత అధికారిక గుర్తింపు లభించనుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment