---Advertisement---

ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులపై కక్ష ఎందుకు? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..!

August 8, 2026

Summarize with AI

---Advertisement---

హైడ్రాలో (HYDRA) 150 డ్రైవర్ పోస్టుల భర్తీ (Driver Posts Recruitment) సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం (Indoor Stadium) వద్ద చోటుచేసుకున్న ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) నాయకుడు హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు(Students), నిరుద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు (Unemployed Youth) తరలిరావడం వారి తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తప్పా? అని నిలదీశారు.

ఇంజనీరింగ్ (Engineering) చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి స్థాయిలో అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన యువతను అధికారులు దుర్భాషలాడటం బాధాకరమన్నారు. అధికారుల తీరును చూస్తుంటే యథా రాజా.. తథా అధికారులు అనే సామెత గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు(Jobs) భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు దాటినా ఆ హామీ ఏమైందని హరీశ్ రావు ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా అని నిలదీశారు.

ఉద్యోగం అడగడం, ప్రశ్నించడం నేరం కాదని హరీశ్ రావు అన్నారు. నిరుద్యోగులపై అనుచితంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, యువతను అవమానించినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment