ఎన్నికల సమయంలో(During the Elections) కూటమి ప్రభుత్వం(Coalition Government) ఉద్యోగులకు(Employees) ఇచ్చిన హామీలను(Promises)అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి(AP JAC Amaravati) ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం(Clear Ultimatum) జారీ చేసింది. ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే ఏ క్షణమైనా ఉద్యమంలోకి దిగుతామని సంఘం నేతలు హెచ్చరించారు.
విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) మాట్లాడుతూ ఉద్యోగులు కొత్తగా ఎలాంటి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో(Manifesto) ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, సీపీఎస్/జీపీఎస్ పునఃసమీక్ష, పెన్షనర్ల ప్రయోజనాలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జూలై 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ ఇప్పటివరకు ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైందని జేఏసీ నేతలు అన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే నిర్ణయాలు ప్రకటించాలని కోరారు.
ఆర్థిక శ్వేతపత్రంలో ఉద్యోగులు, పెన్షనర్లపై(Employees and Pensioners) ప్రభుత్వం చేస్తున్న వ్యయానికి సంబంధించి చూపిన గణాంకాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఏపీ జేఏసీ ఆరోపించింది. 2025–26లో ప్రభుత్వం చేసిన మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఖర్చు సుమారు 37.41 శాతం మాత్రమేనని కాగ్ గణాంకాలను(CAG Data) ఉటంకిస్తూ బొప్పరాజు తెలిపారు. రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఈ వ్యయం 59.36 శాతం, మొత్తం రెవెన్యూ ఆదాయంలో 47.64 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.
ఉద్యోగులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భవిష్యత్తులో మరింత తగ్గనుందని జేఏసీ తెలిపింది. 2024లో 13,643 మంది, 2025లో 13,583 మంది, 2026లో 14,095 మంది చొప్పున మొత్తం 41,321 మంది ఉద్యోగులు ఇప్పటికే పదవీ విరమణ చేశారని వెల్లడించింది. 2035 నాటికి మరో 1,51,755 మంది ఉద్యోగులు పదవీ విరమణ(Retirement) చేయనున్నారని పేర్కొంది. కొత్త నియామకాలు అవసరానికి తగ్గట్టుగా లేకపోవడంతో భవిష్యత్తులో జీతాల వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
ప్రభుత్వం రూ.30 వేల కోట్ల మేర ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు చెబుతున్నప్పటికీ, వాటిలో అధిక భాగం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్(GPF), ఏపీజీఎల్‌ఐ(APGLI), మెడికల్ రీయింబర్స్‌మెంట్ (Medical Reimbursement) తదితర బకాయిలేనని జేఏసీ నేతలు అన్నారు. రెండేళ్లుగా రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ సహా పలు ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సరెండర్ లీవులు, ఇతర పెండింగ్ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల వైద్య రీయింబర్స్‌మెంట్ (Employees’ Medical Reimbursement) విషయంలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని బొప్పరాజు ఆరోపించారు. ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధుల వైద్య ఖర్చులకు వేగంగా రీయింబర్స్‌మెంట్ జరుగుతుండగా, ఉద్యోగులు, పెన్షనర్లు లక్షల రూపాయలు ఖర్చు చేసినా చెల్లింపులు జరగడం లేదన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (Employees Health Scheme – EHS) సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఏపీ జేఏసీ ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ కమిషనర్ నియామకం, ఐఆర్ ప్రకటన(Announcement of IR), పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల (DAs) విడుదల, పాత బకాయిల చెల్లింపులపై స్పష్టమైన టైమ్‌లైన్, సీపీఎస్/జీపీఎస్ పునఃసమీక్ష, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్–ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల అమలు ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి ఆగస్టు 15లోగా సానుకూల నిర్ణయాలు వెలువడకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణ చేపడతామని ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఉద్యమానికి దారితీస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నేతలు స్పష్టం చేశారు.







