---Advertisement---

విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.? అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు..!

August 11, 2026

Summarize with AI

---Advertisement---

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సినీ నటి త్రిష (Trisha) పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే (AIADMK) సీనియర్ నేత ఆర్బీ ఉదయ్ కుమార్(R.B. Udhayakumar), తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌పై (TVK Vijay) విమర్శలు చేస్తూ త్రిషను ప్రస్తావించారు. విజయ్‌కు ప్రియమైన త్రిషను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 8న తూత్తుకుడిలో (Thoothukudi) జరిగిన జయలలిత పేరవై (Jayalalithaa Peravai) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కావేరీ నది (Cauvery River) నీటిని కర్ణాటక(Karnataka) నుంచి తమిళనాడుకు విడుదల చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఉదయ్ కుమార్ ఆరోపించారు. తమిళగ వెట్రి కళగం సినీ పరిశ్రమకు (Film Industry) చెందిన వ్యక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే త్రిష పేరును ప్రస్తావిస్తూ విజయ్‌పై విమర్శలు చేశారు.

ఇటీవల నిర్మాత అర్చన కల్పాతిని (Archana Kalpathi) తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖకు (Hindu Religious and Charitable Endowments Department) సంబంధించిన 7 మంది సభ్యుల రాష్ట్రస్థాయి కమిటీలో నియమించారు. ఈ నియామకాన్ని కూడా ఉదయ్ కుమార్ విమర్శించారు.

ఇదిలా ఉంటే, ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమాన సంఘాలు (Trisha Fan Clubs) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనకు వ్యతిరేకంగా మధురైలో పోస్టర్లు కూడా అంటించారు. త్రిషను రాజకీయ వివాదాల్లోకి లాగడం ఇదే తొలిసారి కాదు.

ఇటీవల డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కూడా త్రిషను ఉద్దేశిస్తూ ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతకుముందు బీజేపీ(BJP) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ (Nainar Nagenthran) కూడా త్రిషపై వ్యాఖ్యలు చేసి, అనంతరం క్షమాపణలు చెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment