తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. సొంత పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మద్దతు (Support) పలకడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు (Congress Government Leaders) వేల కోట్ల అవినీతికి (Corruption) పాల్పడుతున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5-6 లక్షలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం 500 నిబంధనలు విధిస్తోందని విమర్శించారు.
మాటలు సరే.. చర్యలు ఎక్కడ?
తెలంగాణ కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఏఐసీసీకి (AICC) ఏటీఎంగా(ATM) మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారని అన్నారు.
తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ (Prime Minister Modi) చెబుతున్నారని, మరి అలాంటప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Minister Ponguleti Srinivas Reddy) ఈడీ దాడులు (ED Raids) జరిగినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవంపై దాడి జరిగితే యువత తిరగబడుతుందని కేటీఆర్ అన్నారు. ధైర్యంగా నిలబడిన నల్సార్ యువతకు (NALSAR Youth) సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. విద్యార్థులు, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు (CJI Justice Surya Kant) ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని కేటీఆర్ ఆకాంక్షించారు.






