---Advertisement---

పవన్‌ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం ? అన్న నాగబాబుకు ఏకంగా కేబినెట్‌ హోదా!

August 17, 2026

Summarize with AI

---Advertisement---

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) హామీ ఇచ్చి ఏడాదిన్నర దాటినా మంత్రి పదవి దక్కకపోవడంతో.. తన అన్న నాగబాబుకు (Nagababu) ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) కీలక పదవితో పాటు కేబినెట్‌ హోదా (Cabinet Rank) కల్పించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ (Andhra Pradesh Government) పర్యావరణ, అటవీ శాఖ (Environment and Forest Department) AP-GREEN కార్యక్రమం కింద కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)ను AP-GREEN కార్యనిర్వాహక కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నామినేట్‌ చేసింది. ఈ పదవికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

అయితే ఈ నియామకానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో నాగబాబును తన మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చి ఏడాదిన్నర దాటినా, ఇప్పటివరకు ఆ దిశగా నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) తన సొంత శాఖ పరిధిలోని AP-GREEN కార్యనిర్వాహక కమిటీ చైర్‌పర్సన్‌ పదవిని నాగబాబుకు ఇప్పించి, దానికి కేబినెట్‌ హోదా కల్పించడం చర్చకు దారితీసింది.

చంద్రబాబు నుంచి మంత్రి పదవి కోసం ఇక వేచి చూడటం ఇష్టం లేకే పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక కూటమిలోని రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఈ ప్రత్యామ్నాయ పదవి ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ(TDP), జనసేన(Jana Sena) మధ్య దూరం పెరుగుతోందనే చర్చలు జరుగుతున్న సమయంలో ఈ నియామకం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment