---Advertisement---

యువత తిరగబడితే ఏం జరుగుతుందో తెలుసా?.. రేవంత్, పొంగులేటికి హరీశ్ రావు హెచ్చరిక..!

August 19, 2026

Summarize with AI

---Advertisement---

తమ హక్కుల కోసం 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లు (Licensed Surveyors) ధర్నా చేస్తే వారిని పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీటెక్, ఎంటెక్, సివిల్ ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య చదివిన యువతను(Youth) ఉద్దేశించి ఐఏఎస్ అధికారి లోకేశ్ కుమార్ (Lokesh Kumar) బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నారు. సర్వేయర్ల సమస్యలను పరిష్కరించకుండా వారిని అణచివేయడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమైన హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరగబడితే ఏమవుతుందో ఆలోచించుకోండి

విద్యార్థులు(Students), యువత (Youth) తిరగబడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇటీవల ఢిల్లీలో(Delhi) దేశం మొత్తం చూసిందని హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లు, వారి వెనుక ఉన్న 6 వేల కుటుంబాలు ఒక శక్తిగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆలోచించుకోవాలని హెచ్చరించారు. యువత తిరగబడే పరిస్థితి రాకముందే సర్వేయర్లను పిలిచి మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

సర్వేయర్లను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేయడం, బీఆర్ఎస్(BRS) నాయకులను కలవొద్దని బెదిరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం సమస్యలను పట్టించుకోనప్పుడే ప్రజలు ప్రతిపక్షాల వద్దకు వస్తారని, ప్రజల తరఫున నిలబడటమే ప్రతిపక్ష బాధ్యత అని అన్నారు.

ఈగోలు ముఖ్యమా.. ప్రజా సమస్యలు ముఖ్యమా?

సీఎంఓ అధికారుల తీరు ఆశ్చర్యకరంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారితో అధికారులు మాట్లాడకుండా అడ్డుకోవడం అహంకారమని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇచ్చిన బాధ్యత అని, ప్రభుత్వానికి జీతాలు చెల్లించేది ప్రజలు కట్టే పన్నులేనని గుర్తుంచుకోవాలని సూచించారు.

కలెక్టర్లే లంచాలు తీసుకోమని చెబుతున్నారు

అప్పులపాలై కుటుంబాలను పోషించలేక ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. సర్వేయర్లకు కనీస జీతం(Minimum Salary), టీఏ(TA), డీఏ(DA), ఆరోగ్య బీమా లేవని(Health Insurance), సొంత డబ్బులతో సర్వేలు చేయాల్సి వస్తోందన్నారు. 100 రూపాయల పెట్రోల్ ఖర్చు చేసి, ఎకరానికి కేవలం 60 రూపాయలు తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు.

సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తే లంచాలు తీసుకుని వసూలు చేసుకోవాలని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన ఉద్యోగాలు 16,500 మాత్రమేనని అసెంబ్లీ సాక్షిగా వెల్లడైందన్నారు. 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లను కూడా ఉద్యోగాల లెక్కలో చూపించడం మోసమని ఆరోపించారు.

లైసెన్స్ సర్వేయర్లు అధైర్యపడవద్దని, ప్రాణాలు తీసుకోవద్దని హరీశ్ రావు కోరారు. వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment