---Advertisement---

బీసీల రిజర్వేషన్లపై చంద్రబాబు ‘దొంగాట’ అంటూ విమర్శలు ?

August 19, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో బీసీల (BCs సామాజిక, రాజకీయ సాధికారతపై మరోసారి చర్చ మొదలైంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా (Vote Bank) కాకుండా సమాజానికి వెన్నెముకగా భావించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వైఎస్సార్‌సీపీ (YSRCP) వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2019 డిసెంబర్‌ 28న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 176 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) బీసీలకు (BCs) 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంది. ఎస్సీ(SC), ఎస్టీ(ST) రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 58.95 శాతానికి చేరాయి. అయితే ఈ నిర్ణయంపై టీడీపీకి(TDP) చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి (Birru Pratap Reddy) హైకోర్టులో (High Court) కేసులు వేసి అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.

ఈ నేపధ్యంలో కోర్టు పరిమితుల కారణంగా రిజర్వేషన్లు (Reservations) 50 శాతానికి మించి అమలు చేయలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధ్యమైన మేరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిందని ఆ పార్టీ చెబుతోంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలు, మేయర్‌ పదవులు, ఎంపీపీ అధ్యక్ష పదవుల్లో గణనీయమైన సంఖ్యలో బీసీలకు అవకాశం కల్పించినట్లు పేర్కొంటోంది.

అదేవిధంగా ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు(Government Nominated Posts), కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం అవకాశాలు కల్పించేలా చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలను ఉప ముఖ్యమంత్రులు, శాసనసభ స్పీకర్‌, మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించామని ఆ పార్టీ గుర్తుచేస్తోంది.

చట్టసభల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లును ప్రవేశపెట్టడం, దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం వంటి అంశాలను కూడా వైఎస్సార్‌సీపీ తన రాజకీయ విధానానికి ఉదాహరణలుగా ప్రస్తావిస్తోంది.

ఇక తాజాగా బీసీలకు(BCs) 34 శాతం రిజర్వేషన్లను తానే పునరుద్ధరించానని చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. గతంలో ఇదే రిజర్వేషన్లపై న్యాయపరమైన సవాళ్లు సృష్టించింది టీడీపీ(TDP) కాదా అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రిజర్వేషన్లపై కోర్టులను ఆశ్రయించిన వారిని చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన రాజకీయ వైఖరిలో ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయని, గతంలో టీడీపీ పార్టీ వ్యక్తి చేత కేసులు వేయించారని విమర్శిస్తున్నారు.

బీసీలను వారి సంప్రదాయ వృత్తులకే పరిమితం చేసే విధానానికి భిన్నంగా, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతకు తమ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చామని వైఎస్సార్‌సీపీ పేర్కొంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fee Reimbursement), అమ్మఒడి(Amma Vodi), వసతి దీవెన (Vasathi Deevena) వంటి పథకాల ద్వారా బీసీ కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యకు అవకాశం కల్పించామని చెబుతోంది.

మొత్తంగా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, ఆర్థిక సాధికారత విషయంలో గత ప్రభుత్వాల విధానాలపై మరోసారి చర్చ మొదలైంది. బీసీల సంక్షేమం విషయంలో ఎవరి పాలనలో వాస్తవంగా సామాజిక సాధికారతకు ప్రాధాన్యం లభించిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మరో సారి మొదలైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment