హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్‌లో (Madhapur) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర చర్చకు దారితీసింది. ఇనార్బిట్ మాల్లోని(Inorbit Mall) లైఫ్‌స్టైల్ స్టోర్‌లో (Lifestyle Store) ఉద్యోగినిగా పనిచేస్తున్న భారతి ముఖి (Bharathi Mukhi) (26) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో కారును ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన జనసేన (Jana Sena) రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) కుమారుడు లింగమనేని సంజుష్ (Lingamaneni Sanjush) నడుపుతున్నట్లు గుర్తించారు. ఘటనపై లైఫ్‌స్టైల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనలో ఒక యువతి ప్రాణం కోల్పోయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యంతో మరణానికి కారణమైన కేసు కావడంతో, చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.
అయితే, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) కుటుంబానికి సంబంధించిన మరో రోడ్డు ప్రమాద ఘటనలో నమోదైన సెక్షన్లు, తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ విమర్శకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికార పార్టీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు ఒక విధమైన చట్టం, ప్రత్యర్థి పార్టీల నాయకులకు మరో విధమైన చర్యలన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
మాదాపూర్ ప్రమాదంలో నమోదైన సెక్షన్లు, అరెస్టు జరగకపోవడం, సిదిరి అప్పలరాజు కుమారుడు విషయంలో నమోదైన కేసులు, వాటి ఆధారంగా అరెస్టులు మధ్య ఉన్న వ్యత్యాసంపై ఇప్పుడు విమర్శకులు సమాధానం కోరుతున్నారు. చట్టం అందరికీ ఒకేలా అమలవుతుందా? లేక రాజకీయ నేపథ్యాన్ని బట్టి కేసుల స్వరూపం మారుతుందా? అనే ప్రశ్నలు ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చాయి.







