---Advertisement---

విశాఖ రేవ్‌ పార్టీ? మహిళల వివాదం నుంచి కత్తిపోటు వరకు టీడీపీ నాయకుల బరితెగింపు!

August 27, 2026

Summarize with AI

---Advertisement---

విశాఖపట్నంలో (Visakhapatnam) జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌ పార్టీPrivate Resort Party) తీవ్ర వివాదానికి దారితీసింది. జబర్దస్త్‌(Jabardasth) ఫేమ్‌కు చెందిన ఓ నటి పుట్టినరోజు వేడుక పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ(TDP), తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌)కు(TNSF) చెందిన పలువురు నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నట్లు సమాచారం. అయితే మద్యం(Alcohol) మత్తులో మహిళల(Women) విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగి, చివరకు ఒక నాయకుడిపై కత్తితో దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.

ఆనందపురం మండలం శొంఠ్యాంకు(Shontyanku) సమీపంలోని హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌లో(Happy Nature Resorts) మంగళవారం రాత్రి ఈ పార్టీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సుమారు 70 మంది వరకు ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. పార్టీలో భారీగా విదేశీ మద్యం వినియోగించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మద్యం మత్తులో మహిళల విషయంలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి, పరస్పర దాడులకు దారితీసినట్లు సమాచారం.

బుధవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అరకులో రిసార్టు నిర్వహిస్తున్న టీడీపీ(TDP) నేత మమ్ముల వెంకట్‌ దినేష్‌పై(Mammula Venkat Dinesh) యర్రా చరణ్‌తేజ్‌ (Yarra Charan Teja) కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎడమ భుజం వెనుక భాగంలో తీవ్ర గాయమైన దినేష్‌ను చికిత్స కోసం విశాఖలోని విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

అయితే ఈ ఘటనపై మొదట్లో పోలీసుల స్పందన లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ పార్టీలో పాల్గొన్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఘటనను చిన్నదిగా చూపించి రెండు వర్గాల మధ్య రాజీ చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పొరపాటున కత్తి తగిలిందని చెప్పి కేసు నమోదు కాకుండా చూసేందుకు ఒత్తిళ్లు వచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది.

అయితే ఆస్పత్రిలో ఈ ఘటన మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ)గా నమోదవడంతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆనందపురం పోలీసులు యర్రా చరణ్‌తేజ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటన జరిగిన హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌ టీడీపీకి చెందిన మజ్జి శేఖర్‌కు(Majji Shekhar) సంబంధించినదని సమాచారం. ఘటన అనంతరం రిసార్టును మూసివేసినట్లు తెలుస్తోంది. పార్టీ, ఘర్షణకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా సీసీటీవీ ఫుటేజీని తొలగించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది.

అసలు ఈ పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకల్లో మద్యం ఎలా అందుబాటులోకి వచ్చింది? విదేశీ మద్యం వినియోగానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? 70 మందికి పైగా పాల్గొన్నట్లు చెబుతున్న ఈ కార్యక్రమానికి పోలీసులకు సమాచారం ఉందా? ఘర్షణ జరిగిన తర్వాత అక్కడి నుంచి ఎవరెవరు వెళ్లిపోయారు? సీసీటీవీ ఫుటేజీ తొలగించారనే ఆరోపణల్లో నిజమెంత? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

ఇది కేవలం ఒక ప్రైవేట్‌ పార్టీగా జరిగిందా? లేక చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్వహించిన రేవ్‌ పార్టీనా(Rave Party)? అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. అధికార పార్టీ నాయకుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కూటమి పాలనలో తెలుగుదేశం నాయకులు విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఇప్పటికే ప్రజల్లో తీవ్ర అసహనం ఉన్న సమయంలో విశాఖలో జరిగిన ఈ ఘటనతో ప్రజల్లో మరింత తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment