---Advertisement---

నేపాల్ వరదల్లో ఈశా యాత్రికులు గల్లంతు.. కన్నీటి పర్యంతమైన సద్గురు!

August 27, 2026

Summarize with AI

---Advertisement---

నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో ఒక్కసారిగా వచ్చిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలోని ఈశా ఫౌండేషన్‌కు చెందిన యాత్రికుల బృందం చిక్కుకుంది. కైలాస మానస సరోవర యాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణమైన సుమారు 300 మంది యాత్రికులు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ బృందంలో 77 మంది యాత్రికుల ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. గల్లంతైన వారిలో 50 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారు ప్రపంచంలోని 19 దేశాలకు చెందినవారిగా గుర్తించారు. వరదల ధాటికి రహదారులు, వంతెనలు భారీగా దెబ్బతినడంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా సవాలుగా మారింది.

మరోవైపు సద్గురు జగ్గీ వాసుదేవ్ సురక్షితంగా టిబెట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన యాత్రికులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు టిబెట్‌లోని గైరాంగ్ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఈశా ఫౌండేషన్ చైనా ప్రభుత్వాన్ని కోరింది.

యాత్రికుల ఆచూకీ కోసం హెలికాప్టర్లతో పాటు స్థానిక సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు చైనా, నేపాల్ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

యాత్రికుల పరిస్థితిపై సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గల్లంతైన వారి కుటుంబాల ఆందోళనను గుర్తుచేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment