---Advertisement---

తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. నిందితుడు అరెస్ట్.. లైంగిక దాడి నిర్ధారణ!

August 31, 2026

Summarize with AI

---Advertisement---

తుక్కుగూడ నర్సు (Tukkuguda Nurse) శిరీష (Shireesha) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న శిరీషపై లైంగిక దాడికి(Sexual Assault) ప్రయత్నించిన అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బిహార్‌కు(Bihar) చెందిన కార్ల మెకానిక్‌ మహ్మద్‌ సనావుల్లా (34) (Mohammed Sanaulla, 34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల శిరీష సుమారు 8 నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. ఆస్పత్రి ప్రాంగణంలోని హాస్టల్‌లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ(Rakhi Festival) సందర్భంగా ఆమె రూమ్‌మేట్స్‌(Roommates) స్వగ్రామాలకు వెళ్లడంతో శుక్రవారం రాత్రి శిరీష ఒక్కరే గదిలో నిద్రించింది.

శనివారం మధ్యాహ్నం వరకు ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా శిరీష విగతజీవిగా కనిపించింది. దీంతో పహాడీషరీఫ్‌ పోలీసులు (Pahadi Shareef Police) అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాలతో లైంగిక దాడి, హత్య కోణంలో విచారణ చేపట్టారు.

ఆస్పత్రి సమీపంలోని కార్ల మెకానిక్‌ షాపులో (Car Mechanic Shop) పనిచేస్తున్న మహ్మద్‌ సనావుల్లాపై(Mohammed Sanaulla) పోలీసులకు అనుమానం వచ్చినట్లు సమాచారం. ఇతర కార్మికులు వెళ్లిపోయిన తర్వాత అతడు షాపులోనే నిద్రించేవాడని, కొంతకాలంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుల కదలికలను గమనిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

శిరీష గదిలో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సనావుల్లా అర్ధరాత్రి హాస్టల్‌లోకి (Hostel) ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. గదికి ఉన్న కిటికీకి గ్రిల్స్‌ లేకపోవడంతో అదే మార్గం ద్వారా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా శిరీష ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ హత్యలో సనావుల్లా ఒక్కరే పాల్గొన్నాడా? మరెవరైనా అతడికి సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక (Forensic Report) అందిన తర్వాత కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) మార్చురీలో శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో(Postmortem Report) ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment