---Advertisement---

సుప్రీంకోర్టు హామీతో సీజేపీ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 5 నిరసన మార్చ్ రద్దు!

September 1, 2026

Summarize with AI

---Advertisement---

కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో(New Delhi) నిర్వహించాల్సిన నిరసన మార్చ్‌ను (Protest March) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీతో పాటు బీజేపీ(BJP) పాలిత 4 రాష్ట్రాల్లో నీట్ ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించబోమని, ఇకపై కొత్త కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు (Supreme Court) హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.

ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అసోం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు ఈ హామీలు ఇచ్చారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని, నిరసనలకు సంబంధించి కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. నిరసనకారులతో కేంద్రం చర్చలు జరిపిందని, పలు అంశాలపై అవగాహన కుదిరిందని తెలిపారు.

ఆర్టికల్ 142 కింద ఎఫ్‌ఐఆర్‌ల కొట్టివేత

ఈ నేపథ్యంలో సీజేఐ సూర్యకాంత్ (Justice Suryakant) నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 142ను వినియోగించి ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నమోదైన కేసులు మాత్రం కొనసాగుతాయని తెలిపింది.

జూలై 25న కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ సీజేపీ సెప్టెంబర్ 5న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. తాజాగా కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీల నేపథ్యంలో ఆ నిరసనను ఉపసంహరించుకుంది.

మృతుల కుటుంబాలకు పరిహారం

నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) తర్వాత ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తుషార్ మెహతా (Tushar Mehta) తెలిపారు. పరిహార విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములతో చర్చించి 3 నెలల్లో ఖరారు చేస్తామని చెప్పారు. విధివిధానాలు పూర్తైన వెంటనే పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభించాలని సీజేఐ సూర్యకాంత్ సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment