---Advertisement---

కృష్ణా జలాలపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు!

September 5, 2026

Summarize with AI

---Advertisement---

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board – KRMB) శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో జలవిద్యుత్ ఉత్పత్తిని (Hydropower Generation) వెంటనే నిలిపివేయాలని ఆదేశించడంపై బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) చేతగానితనం, అసమర్థ పాలన వల్లే తెలంగాణకు ఈ పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఎల్‌నినో(El Niño) పేరుతో తెలంగాణ హక్కులకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వెలిగొండ ప్రాజెక్టుకు (Veligonda Project) ఏ నిబంధనల ప్రకారం నీటిని తరలిస్తున్నారో కేఆర్‌ఎంబీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం తమ ప్రయోజనాల కోసం గట్టిగా పనిచేస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) పంపులను మూసివేసి ఏపీకి(Andhra Pradesh) సహకరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ నిబంధనలు తెలంగాణకే వర్తిస్తాయా అని నిలదీశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను ఏపీకి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుతో పాటు కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతుల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తే వ్యవసాయ బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఆగస్టు 21న శ్రీశైలంలో 169 టీఎంసీల నీరు ఉండగా, 15 రోజుల్లోనే 30 టీఎంసీలు తగ్గి 139 టీఎంసీలకు చేరిందని కేటీఆర్ తెలిపారు. కల్వకుర్తి ద్వారా పరిమితంగా నీటిని ఎత్తిపోస్తున్న సమయంలో మిగిలిన నీరంతా ఎక్కడికి వెళ్లిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment