---Advertisement---

KCR: నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ కీలక చర్చ!

September 6, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం (BRS Legislative Party Meeting) నేడు జరగనుంది. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అధ్యక్షతన ఎర్రవెల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలతో(MLCs) కేసీఆర్‌ కలిసి భోజనం(Lunch) చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Sessions) ప్రభుత్వాన్ని నిలదీసేందుకు లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government) ఏర్పడి 1000 రోజులు పూర్తైన నేపథ్యంలో జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ, శాసనమండలిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయంతో వ్యవహరించేలా కేసీఆర్‌ పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment