---Advertisement---

చెన్నైలో టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో నరికి చంపిన దుండగులు (Video)!

September 7, 2026

Summarize with AI

---Advertisement---

చెన్నైలో(Chennai) తమిళగ వెట్రి కళగం (టీవీకే) (TVK) పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. వాంతురై ప్రాంతంలో టీవీకే నేత కన్నన్‌ (Kannan) (45)ను కొందరు దుండగులు వెంటాడి కొడవళ్లతో(Sickles) విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కన్నన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్‌ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

కన్నన్‌ గతంలో అన్నాడీఎంకే (AIADMK) 174వ వార్డు కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల ఆయన టీవీకే పార్టీలో చేరారు. అయితే టీవీకేలో చేరిన కారణంగానే కన్నన్‌ హత్యకు గురయ్యారనే విషయాన్ని పోలీసులు ఇప్పటివరకు నిర్ధారించలేదు. కన్నన్‌పై గతంలో హత్య, హత్యాయత్నం సహా పలు క్రిమినల్‌ కేసులు(Criminal Cases) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ముఖ్యంగా 2009లో జరిగిన శివ హత్య కేసుకు (Shiva Murder Case) సంబంధించిన పాత కక్షలే ప్రస్తుత హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు కన్నన్‌ నిర్వహిస్తున్న కార్ల అద్దె వ్యాపారానికి (Car Rental Business) సంబంధించిన వివాదాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

కన్నన్‌ను దుండగులు వెంటాడుతూ కొడవళ్లతో దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకు 5 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాత కక్షలు, కన్నన్‌ క్రిమినల్‌ నేపథ్యం, వ్యాపార వివాదాలు సహా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. టీవీకే అధినేత, నటుడు విజయ్‌(Vijay) శాంతిభద్రతల (Law and Order) అంశంపై అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్న సమయంలోనే ఈ హత్య జరగడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment