---Advertisement---

లండన్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!

September 7, 2026

Summarize with AI

---Advertisement---

లండన్‌లో (London) ఉద్యోగాలు (Jobs) ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్‌ నందనను (Nandana) ఆర్జీఐఏ పోలీసులు (RGIA Police) అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్‌ఔట్‌ నోటీసులు (Lookout Notices) జారీ కావడంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న నందనను అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు (Ibrahimpatnam Police) అప్పగించారు. నందనతో పాటు ఆమె భర్త కూడా లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగానే నందనపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగానే ఆర్జీఐఏ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించడంతో ఈ కేసులో ఆమె పాత్ర, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు, బాధితుల సంఖ్య తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment