---Advertisement---

శాసనసభను ‘దుశ్శాసన సభగా మార్చేశారు’.. రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

September 7, 2026

Summarize with AI

---Advertisement---

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వైఖరితో పాటు పోలీసుల తీరుపై బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ అంశంపై తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో(Assembly) తాము ఎలాంటి అనుచిత పదాలు ఉపయోగించలేదని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) తరహాలో టీ షర్టులు ధరించి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అసెంబ్లీలో ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని కేసీఆర్(KCR) తమకు సూచించారని కేటీఆర్ తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన పోలీసు బృందం అత్యంత దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు.

మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Lakshma Reddy), సబితా ఇంద్రారెడ్డిపై(Sabitha Indra Reddy) పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసు బలగాల చర్యలను ప్రజలంతా గమనించారని అన్నారు. ఈ ఘటన వెనుక ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.

టీ షర్టులపై అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయని చెప్పడానికి డీసీపీ శిల్పవల్లి (DCP Shilpavalli) ఎవరు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఏ నిబంధన ప్రకారం తమను అడ్డుకున్నారో స్పష్టంగా చెప్పకుండా, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే తమపై ఆంక్షలు విధించారని విమర్శించారు.

శాసనసభను (Legislative Assembly) దుశ్శాసన సభగా(Dushasana Sabha) మార్చేశారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మరల్చేందుకే ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు.

స్పీకర్ స్థానంలో ఉండి వివక్ష చూపడం సరికాదని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వబోమని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో జరిగిన గందరగోళానికి ఆద్యుడైన సీఎం రేవంత్ రెడ్డి నిరసనకారులు, మహిళా నేతలకు క్షమాపణ చెప్పే వరకు సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

గతంలో డీకే అరుణకు(DK Aruna) తాము క్షమాపణ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. తాతా మధు విచారం వ్యక్తం చేయాలని కేసీఆర్ ఆదేశించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిజంగా దళితులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ ప్రకటనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.

అసెంబ్లీలో అనుచిత పదాలు మాట్లాడే రేవంత్ రెడ్డి తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. 100 రోజుల్లో హామీలు అమలు చేయలేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు నిరసనగా బీఏసీ సమావేశాన్ని (BAC Meeting) బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తే అవసరమైతే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కేటీఆర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment