---Advertisement---

తమిళనాడు సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక అప్‌డేట్!

September 19, 2026

Summarize with AI

---Advertisement---

తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే చికెన్ బిర్యానీ (Chicken Biryani) అందించే అవకాశం ఉంది. విద్యార్థులకు మరింత పోషకాహారం అందించడమే లక్ష్యంగా మధ్యాహ్న భోజన పథకంలో(Mid-Day Meal Scheme) భాగంగా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి(CM) సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా(Dream Project) దీనిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ (Raj Mohan) పేర్కొన్నారు.

అయితే ఈ పథకాన్ని వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోమని మంత్రి స్పష్టం చేశారు. ముందుగా కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా(Pilot Project) అమలు చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతను పరిశీలించిన తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పుళల్ జైలులో ఖైదీలకు చికెన్ బిర్యానీ అందిస్తున్నప్పుడు, రేపటి పౌరులైన పాఠశాల విద్యార్థులకు (School Students) ఎందుకు ఇవ్వకూడదని మంత్రి ప్రశ్నించారు. ఎదుగుతున్న పిల్లలకు అవసరమైన ప్రొటీన్లు అందించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 1 రోజు చికెన్ బిర్యానీ అందించే అంశంపై 2026 జూలై నుంచే కసరత్తు జరుగుతోంది.

శాకాహారం (Vegetarian Food) తీసుకునే విద్యార్థులకు సాధారణ భోజనమే అందించనున్నారు. మాంసాహారం(Non-Vegetarian Food) తీసుకునే విద్యార్థులకు మాత్రమే చికెన్ బిర్యానీ అందించే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో వంట చేయడం, పాఠశాలలకు సురక్షితంగా తరలించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

తమిళనాడులో ఇప్పటికే మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం అల్పాహార పథకం (Breakfast Scheme) కూడా అమలవుతోంది. విద్యార్థుల హాజరు, ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా చికెన్ బిర్యానీ పథకంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment