---Advertisement---

అయోధ్య రామ మందిరంలో 105 సార్లు కానుకల అక్రమాలు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక!

September 22, 2026

Summarize with AI

---Advertisement---

అయోధ్య(Ayodhya) రామ మందిరంలో(Ram Temple) కానుకల లెక్కింపు (Donations Counting) సమయంలో దాదాపు 105 సార్లు అక్రమాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్(SIT) సుప్రీంకోర్టుకు (Supreme Court) సమర్పించిన నివేదికలో వెల్లడించింది. హుండీ లెక్కింపు గదిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. అనుమతి లేకుండా నగదును పక్కకు పెట్టడం, దాచడం వంటి ఘటనలు నమోదైనట్లు తెలిపింది.

ఈ కేసులో ఇప్పటివరకు 173 మంది సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సిట్ వెల్లడించింది. సెప్టెంబర్ 25 నాటికి ఛార్జ్‌షీట్ (Chargesheet) దాఖలు చేస్తామని తెలిపింది. దర్యాప్తులో కొంతమంది అనుమానితులను గుర్తించినట్లు పేర్కొంది.

మరోవైపు భక్తులు సమర్పించిన 200 కిలోల వెండి ఇటుకలు, 38.288 కిలోల వెండి(Silver), వెండి హారం(Silver Necklace), రాముడి చరణ పాదుకలు(Ram’s Silver Footwear), రామచరితమానస్ (Ramcharitmanas) పుస్తకాల దానాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు సిట్ స్పష్టం చేసింది. సంబంధిత రికార్డులను పరిశీలించగా ఎలాంటి తేడాలు గుర్తించలేదని తెలిపింది.

రసీదులు (Receipts) లేకుండా వచ్చిన 86 రకాల విలువైన కానుకలను అధికారులు గుర్తించగా.. టీసీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా రసీదులు జారీ చేసిన మరో 803 కానుకలను సిట్ పరిశీలించింది. ట్రస్ట్ రికార్డులు, ఎస్‌బీఐ లాకర్లలోని కానుకలను కూడా భౌతికంగా తనిఖీ చేసినట్లు వెల్లడించింది.

ఇక వెండిగా భావిస్తున్న 944.411 కిలోల తెల్లటి లోహాన్ని అసలు విలువ నిర్ధారణ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (PMCIL) పంపినట్లు సిట్ తెలిపింది. సీసీటీవీ దృశ్యాలు, బ్యాంకు లాకర్లు, ట్రస్ట్ రికార్డుల ఆధారంగా నివేదికను సిద్ధం చేసినట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు సిట్ నివేదికను రికార్డుల్లోకి తీసుకుంది. సెప్టెంబర్ 25న దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment