---Advertisement---

బంగాళాఖాతంలో వాయుగుండం… తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్!

September 23, 2026

Summarize with AI

---Advertisement---

బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం (Depression) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), ఒడిశా (Odisha) రాష్ట్రాలకు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది.

రాబోయే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరించింది. ఆ తర్వాతి రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగనుంది. మంగళవారం రాత్రి 11:30 గంటలకు వాయుగుండం కళింగపట్నానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి (Visakhapatnam) ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.

ఉత్తరాంధ్ర(North Andhra), దక్షిణ ఒడిశా (South Odisha) మధ్య కళింగపట్నానికి(Kalingapatnam) సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు.

కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వంశధార, నాగావళి నదుల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు లోతట్టు, ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment