బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో(Theatre) సినిమా చూసేందుకు సిద్ధమయ్యారు. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని థియేటర్‌లో వీక్షించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
నాని ‘ప్యారడైజ్’ చూడనున్న కేటీఆర్
చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ రాత్రి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడబోతున్నట్లు కేటీఆర్(KTR) తెలిపారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో నాని(Nani) ఒకరని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) రూపొందించిన ‘ది ప్యారడైజ్’(The Paradise) చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కలెక్షన్లలో ‘ది ప్యారడైజ్’ జోరు
మరోవైపు ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లపై (Collections) పెద్దగా ప్రభావం కనిపించడం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
విడుదలైన 2 రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి (₹100 Crore Club) చేరినట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో వసూళ్లు బలంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జోరు వీకెండ్ వరకు కొనసాగితే తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
— KTR (@KTRBRS) September 26, 2026






