---Advertisement---

ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ అలియాస్ విజయ్ కుమార్ కన్నుమూత!

September 30, 2026

Summarize with AI

---Advertisement---

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘ఏకం’ (Ekam) వ్యవస్థాపకులు విజయ్ కూమార్ నాయుడు (Vijay Kumar Naidu) అలియాస్ కల్కి భగవాన్ (Kalki Bhagwan) (77) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని (Chennai) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత 10 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ట్రస్ట్ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు.

దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ కల్కి భగవాన్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్నారు. ఆయన మృతి వార్తతో ఆధ్యాత్మిక వర్గాల్లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, భక్తులు కల్కి భగవాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

కల్కి భగవాన్ పార్థివదేహాన్ని(Mortal Remains) తిరుపతి జిల్లా పరిధిలోని బత్తులవల్లంలోని ప్రసిద్ధ ‘ఏకం’ ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తులు, అనుచరులు చివరి దర్శనం చేసుకునేలా పార్థివదేహాన్ని ఆలయంలో ఉంచనున్నారు.

కల్కి భగవాన్‌ను చివరిసారిగా దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ ప్రాంగణంలో భద్రత, నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కల్కి భగవాన్ అంత్యక్రియలను శనివారం అధికారిక లాంఛనాలు, సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అంతిమ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment