---Advertisement---

టీడీపీకి అసహనం పెరిగిపోతుందా? అందులో భాగమే ఈ దాడులా?

February 2, 2026

---Advertisement---

సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పెద్దలకి అసహనం రోజు రోజుకి పెరిగిపోతునట్టు కనిపిస్తుంది. జగన్(Jagan) కన్నా తాము మరిన్ని ఎక్కువ పధకాలు ఇచ్చి సమాంతరంగా అభివృద్ది చేసి తద్వార సంపద సృష్టిస్తాం అంటూ హామీలు గుప్పించిన తెలుగుదేశం , అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చిన దాఖలాలు లేవు. అభివృద్ది పరంగా చూస్తే రాష్ట్రంలో చెప్ప్పుకోదగ్గ పరిశ్రమలు రాకపోగా , అమరావతి (Amaravati Capital City) నిర్మాణ పనులు అనుకున్న స్థాయిలో ముందుకు కదలడం లేదు, రెండో విడిత భూ సేకరణకు రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత ఏదురౌతుంది.. సంపద సృష్టిస్తా అంటూ మైకులు ముందు గట్టిగా చెప్పిన చంద్రబాబు (N. Chandrababu Naidu) గారు ఇప్పుడు అప్పులు చేయందే పూట గడవని పరిస్థితిలో రాష్ట్రా ఆర్ధిక పరిస్థితిని పడేశారనే విమర్శ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

ప్రతిపక్షంలో ఉండగా జగన్ పాలనపై ప్రచారం చేసిన అనేక అంశాలు ఇప్పుడు టీడీపీకే భూమరాంగ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ది చేయలేదని జగన్ పై విమర్శలు గుప్పించిన వీరే , ప్రజామోగ్యం కాని నిర్ణయాలు తీసుకుని మెడికల్ కాలేజీలు నిర్మించి జగన్ అభివృద్ది చేశాడని ప్రజలకి చూపించారు. అలాగే విజయవాడ వరద వచ్చిన రోజున రిటైనింగ్ వాల్ నిర్మాణం జగన్ చేపట్టిందే అని ప్రజలకి తెలిసింది, తిరుమలలో చోరి అని ప్రచారం చేయడంతో జగన్ పరకామణి నూతన భవనం నిర్మాణం చేపట్టిన విషయం ప్ర్జలకి తెలిసింది. రుషికొండ ప్రభుత్వ భవనం అలాగే పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజక్ట్, రైల్వే జోన్ భవనాల నిర్మాణం, పిన్నాపురం గ్రీన్ కో ప్రాజక్ట్, భోగాపురం ఎయిర్ పోర్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ అన్ని రంగాల్లో చేసీన అభివృద్దిని టీడీపీ నేతలే ప్రజలకు చూపిస్తునట్టు అయింది.

తాము ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయినట్టు జగన్ పై విష ప్రచారం చేద్దాం అనుకుంటే అవి ఆయనకే మేలు జరిగేలా టర్న్ అవ్వడం టీడీపీకి జీర్నించుకోలేని అంశంగా మారింది ఈ క్రమంలో చంద్రబాబు గారు తిరుమల లడ్డూలో జంతు కోవ్వు అంటూ చేసిన ఆరోపణలో నిజం లేదని సీబీఐ చార్జ్ షీట్ వేయడంతో టీడీపీ కోలుకోలేని డిఫెన్స్ లో పడిపోయినట్టు కనిపిసుంది. ఆ అసహనం తోనే ఫ్లెక్సీ రాజకీయానికి తెరలేపి మాజీ మంత్రులైన అంబటి రాంబాబు (Ambati Rambabu)పై, జోగి రమేష్ (Jogi Ramesh) పై, విడదల రజనీ (Vidadala Rajini)పై దాడికి తెగబడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చ మోదలైంది. ఏది ఏమైనా టీడీపీ అసహనం చూస్తుంటే, అంతా సవ్యంగా జరగడంలేదని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్టే కనిపిస్తుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment