---Advertisement---

‘హనుమాన్ చాలీసా’ స్మరిస్తూ చావుతో పోరాటం.. భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ వీరగాథ!

October 2, 2026

Summarize with AI

---Advertisement---

వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో తోటి పైలట్ (Co-pilot) కత్తితో(Knife) దాడి చేస్తే.. పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్నా, మరోవైపు వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా పోరాడిన భారతీయ పైలట్(Indian pilot) కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (Captain Smith Machhar) ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

చావును ఎదుర్కొంటూనే ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చివరి వరకు పోరాడిన స్మిత్ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) వీడియో కాల్‌లో మాట్లాడారు. ప్రమాద సమయంలో ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, నిగ్రహాన్ని మోదీ ప్రశంసించారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు సొంత ప్రాణాలను సైతం పణంగా పెట్టే భారతీయుల విలువలకు స్మిత్ మచ్ఛర్ నిదర్శనమని అన్నారు.

స్మిత్ తల్లి (Smith’s mother) గీతా బెన్ (Geeta Ben) తన కుమారుడికి భగవద్గీతలోని (Bhagavad Gita) గొప్ప విలువలను నేర్పి పెంచారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ విలువలు, ఆత్మవిశ్వాసమే ప్రమాద సమయంలో స్మిత్‌కు ధైర్యాన్ని ఇచ్చాయని ప్రశంసించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని దేశమంతా కోరుకుంటోందని తెలిపారు.

ప్రధానితో మాట్లాడిన సమయంలో స్మిత్ మచ్ఛర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోదీ స్వయంగా తనను పలకరించి ధైర్యం చెప్పడం జీవితంలో మర్చిపోలేని క్షణమని అన్నారు. తనను ప్రోత్సహిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

దాడిలో తీవ్రంగా గాయపడి కిందపడిపోయినా, తిరిగి లేచి నిలబడకపోతే తన ప్రాణాలు పోతాయని గుర్తించినట్లు స్మిత్ చెప్పారు. ఆ సమయంలో తాను తన ప్రాణాల కోసం మాత్రమే కాకుండా విమానంలోని ప్రయాణికులందరి కోసం పోరాడినట్లు వివరించారు.

11 ఏళ్లుగా కెప్టెన్‌గా పనిచేస్తున్నానని చెప్పిన స్మిత్.. ప్రమాద సమయంలో భగవంతుడే తనను కాపాడాడని అన్నారు. ఆ సమయంలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) స్మరిస్తూ ధైర్యంగా ఉన్నానని తెలిపారు.

విమానం ఒక్కసారిగా కిందకు వెళ్తుండటాన్ని గమనించిన స్మిత్ ప్రయాణికుల ప్రాణాల గురించి ఆందోళన చెందారు. తీవ్ర గాయాలతోనూ అతి కష్టం మీద కాక్‌పిట్‌ను (Cockpit) తెరిచినట్లు చెప్పారు. అనంతరం ప్రయాణికులు ముందుకు వచ్చి విమానాన్ని అదుపులోకి తీసుకున్నారని వివరించారు.

ఆపద సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం తనకు అలవాటని స్మిత్ తెలిపారు. ఈ ప్రమాదంలోనూ అదే స్మరిస్తూ తనకు తాను ధైర్యం చెప్పుకున్నానని, పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా చివరి వరకు పోరాడానని వెల్లడించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment