---Advertisement---

నిన్న‌గాక మొన్న అమెరికా నుంచి వ‌చ్చావ్‌ ఏం చూస్తావ్ త‌డాఖా – బోత్సా ఫైర్

February 2, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ సీనియర్ నాయకుడు బోత్సా సత్యనారాయణ తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు, విలువలు తెలియకుండా మాట్లాడటం ప్రమాదకరమని హెచ్చరించారు.

గుంటూరులో లడ్డూ ఫ్లెక్సీ వివాదం నేపథ్యంగా, అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుని దూషించారని కట్టుకథలు అల్లి ఆయనను లక్ష్యంగా చేసుకోవడాన్ని బోత్సా తప్పుపట్టారు. “నిన్నగాక మొన్న అమెరికా నుంచి వచ్చావు… ఇక్కడి ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకో” అంటూ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.

అయితే, పెమ్మసాని చేసిన హెచ్చరికల గంటల వ్యవధిలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగడం, గృహదహనానికి పాల్పడటం రాజకీయాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. బహిరంగంగా ఇలాంటి హెచ్చరికలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాటల స్థాయి దాటితే ప్రజాస్వామ్యానికి ముప్పేనన్న ఆందోళన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment