తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) (TTD) నెయ్యి కొనుగోళ్లపై సీబీఐ(CBI) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) వెలుగులోకి తెచ్చిన విషయాలు టీడీపీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం, కల్తీ నెయ్యి సరఫరా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రభుత్వ హయాంలోనూ జరిగినట్టు స్పష్టం చేస్తుంది.
నెల్లూరులోని ఏసీబీ కోర్టు(ACB Court)లో సమర్పించిన చార్జిషీట్‌లో, 2019 ఫిబ్రవరిలోనే, అంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే కల్తీ నెయ్యి టీటీడీ సరఫరా వ్యవస్థలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. భోలే బాబా డెయిరీకి అనుబంధ సంస్థ అయిన హర్ష్ ఫ్రెష్ డెయిరీ (Harsh Fresh Dairy), టీడీపీ పాలనలోనే నకిలీ తనిఖీ నివేదికలు సమర్పించి, అధికారులతో కుమ్మక్కై, తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా కాంట్రాక్టులు పొందిందని సిట్ నిర్ధారించింది.
అంతేకాక, వైఎస్సార్‌సీపీ పాలనలో 2020లో కొనుగోలు నిబంధనల్లో మార్పులు చేయడానికి ముందు కూడా లడ్డూల తయారీకి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి సరఫరా కొనసాగినట్లు దర్యాప్తు వెల్లడించింది. విధాన మార్పులు లేదా ప్రభుత్వ మార్పుతో సంబంధం లేకుండా, టీటీడీ సేకరణ విభాగంలోని అవినీతి కారణంగానే ఇలాంటి అర్హతలేని సరఫరాదారులు వ్యవస్థలో కొనసాగగలిగారని సిట్ స్పష్టం చేసింది. ఈ నివేదికతో, తిరుమల నెయ్యి వ్యవహరం మరో మలుపు తిరిగి టీడీపీ మేడకు చుట్టుకున్నట్టు కనిపిస్తుంది.
తొలుత వైఏస్సార్సీపీ పాలనలో లడ్డూలో జంతూ కోవ్వు కలిపారని విపరీతంగా ప్రచారం చేసిన టీడీపీకి ఇప్పుడు ఈ పరిణామం మింగుడుపడని విషయంగా మారుతోంది. సిట్ ధర్యాప్తు తరువాత అసలు నెయ్యిలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) గారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు ఆరోపించినట్టు జంతు కోవ్వు కలవలేదని స్పష్టం చేస్తూనే, రసాయనాలతో జరిగిన కల్తీ వైయస్సార్ పార్టీ అధికారంలోకి రాకముందు నుండే ఉందని తేల్చడం తెలుగుదేశానికి , జనసేనకి గట్టి షాక్ అనే చెప్పవచ్చు.






