---Advertisement---

Indian Air Force: కొత్త ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం!

October 6, 2026

Summarize with AI

---Advertisement---

భారత వైమానిక దళానికి (Indian Air Force) 29వ అధిపతిగా ఆశుతోష్ దీక్షిత్ (Ashutosh Dixit) నియమితులయ్యారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా ఉన్న ఆయన.. ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) పదవీ విరమణ అనంతరం అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టనున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల సేవా అనుభవం ఉన్న దీక్షిత్ 1986 డిసెంబర్ 6న ఫైటర్ విభాగంలో చేరారు. ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా (Qualified Flying Instructor) పనిచేసిన ఆయనకు వివిధ యుద్ధ విమానాలపై 3,500 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది.

మిరాజ్-2000, మిగ్ సిరీస్, జాగ్వార్, హాక్, తేజస్ సహా పలు విమానాలను నడిపిన దీక్షిత్.. ఆపరేషన్ సఫేద్ సాగర్, రక్షక్, సిందూర్ వంటి కీలక ఆపరేషన్లలోనూ పనిచేశారు. మిరాజ్-2000 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్‌గా, పలు ఫైటర్ ఎయిర్‌బేస్‌లకు కమాండర్‌గా, సదరన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.

సెంట్రల్ ఎయిర్ కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా సేవలందించిన ఆయన.. 2026 జూలై 1న వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తేజస్ సహా పలు స్వదేశీ విమాన ప్రాజెక్టులు, ప్రణాళికలు, వైమానిక సామర్థ్యాల అభివృద్ధిలోనూ ఆయనకు అనుభవం ఉంది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (National Defence Academy – NDA) పూర్వ విద్యార్థి అయిన ఆశుతోష్ దీక్షిత్ బంగ్లాదేశ్‌లోని స్టాఫ్ కోర్స్, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణ పొందారు. ఆయన సేవలకు గుర్తింపుగా వాయుసేన మెడల్, విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, పరమ విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు.

అక్టోబర్ 31న అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆశుతోష్ దీక్షిత్ వైమానిక దళం అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుదీర్ఘ ఫైటర్ పైలట్ అనుభవం ఉన్న ఆయనకు ఇప్పుడు భారత వైమానిక దళానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment