దసరా (Dasara) పండుగ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు (Students) సెలవులు (Holidays) వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో అక్టోబర్ 10 నుంచి పాఠశాలలకు వరుస సెలవులు ప్రారంభం కానున్నాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కూడా కలిసిరావడంతో విద్యార్థులకు ముందుగానే పండుగ విరామం లభించనుంది. అయితే రెండు రాష్ట్రాల్లో సెలవుల ముగింపు, పాఠశాలల పునఃప్రారంభ తేదీలు వేర్వేరుగా ఉన్నాయి.
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. మొత్తం 13 రోజుల విరామం తర్వాత అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మరోవైపు, జూనియర్ కళాశాలలకు(Junior Colleges) అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఉండనున్నాయి. వారాంతపు సెలవులతో కలిపి విద్యార్థులకు వరుసగా 12 రోజుల విరామం లభించనుంది. సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. ఇంటర్మీడియట్ కళాశాలలకు కూడా అక్టోబర్ 21 వరకు సెలవులు వర్తించనున్నాయి.
దసరా సెలవులతో విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు అవకాశం లభించనుంది. సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత తేదీలను గుర్తుంచుకోవాలి.






