---Advertisement---

ఢిల్లీలో హైటెన్షన్..పోలీసుల అదుపులోకి మమతా, కేజ్రీవాల్ సహా కీలక నేతలు!

October 10, 2026

Summarize with AI

---Advertisement---

ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిరసనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee), ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో(Pinarayi Vijayan) పాటు పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

తన పార్టీ ఎంపీలతో కలిసి సెంట్రల్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూ (South Avenue) ప్రాంతానికి చేరుకున్న మమతా బెనర్జీని పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె అక్కడి బస్టాప్‌లో కూర్చుని నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియెన్(Derek O’Brien), దోలా సేన్(Dola Sen) సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని, ప్రజల గొంతుకను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇండియా కూటమి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

మరోవైపు, నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరిన అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు ఆయన నివాసం బయటే అదుపులోకి తీసుకున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌లను (John Brittas) కూడా అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియంలోని నిర్బంధ కేంద్రానికి తరలించారు.

జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనకు మద్దతుగా వెళ్లిన పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఢిల్లీలో రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment