---Advertisement---

రాష్ట్రపతి ఉత్తర్వులతో పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం!

October 12, 2026

Summarize with AI

---Advertisement---

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి భవన్ సోమవారం ప్రకటించిన ఈ నియామకాల్లో పలువురు గవర్నర్లకు (Governors) కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు బదిలీలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాశ్ మాథుర్‌ను (Om Prakash Mathur) కేరళకు బదిలీ చేయగా, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు(Rajendra Vishwanath Arlekar) తమిళనాడు బాధ్యతలు అప్పగించారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం బ్రజ్ మోహన్ రామ్‌ను (Braj Mohan Ram) ఒడిశా గవర్నర్‌గా, డాక్టర్ సుధా యాదవ్‌ను(Dr. Sudha Yadav) కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. డాక్టర్ ఢాల్ సింగ్ బిసేన్‌కు (Dr. Dhal Singh Bisen) ఉత్తరాఖండ్ గవర్నర్ బాధ్యతలు అప్పగించగా, దుష్యంత్ గౌతమ్‌ను (Dushyant Gautam) సిక్కిం గవర్నర్‌గా నియమించారు.

ఈ నియామకాలు, బదిలీలతో ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల బాధ్యతల్లో మార్పులు జరగనున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్లు త్వరలోనే తమకు కేటాయించిన రాష్ట్రాల్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment