ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘AA-23’ సినిమాపై వస్తున్న పుకార్లకు మేకర్స్ చెక్ పెట్టారు. ప్రాజెక్ట్ రద్దయిందనే ప్రచారం మధ్య త్వరలోనే ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘AA-23’ రూపొందనుంది. చాలా రోజులుగా ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ లేకపోవడంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోను షేర్ చేసిన లోకేష్ కనగరాజ్, మైత్రీ మూవీ మేకర్స్.. ‘ఏదో భారీ విషయం రూపుదిద్దుకుంటోంది. AA-23 నుంచి త్వరలోనే ఆసక్తికరమైన అప్‌డేట్స్ రాబోతున్నాయి.. వేచి చూడండి’ అని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా పోస్ట్‌తో బన్నీ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి.







