రైతు బీమా (Rythu Bima) పరిహారం (Compensation) అందని బాధిత కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని(Siddipet) తన క్యాంపు కార్యాలయంలో పరిహారం అందని 22 మంది రైతుల కుటుంబాలతో (Farmers Families) సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతు బీమా పథకాన్ని(Rythu Bima Scheme) తక్షణమే పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Government) కోరారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి నివాసం (Chief Minister Residence) ముందు ధర్నా(Protest) నిర్వహిస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రైతుల సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల (Power Cuts) విషయంలో క్షేత్రస్థాయి అధికారులపైనే కాకుండా, బాధ్యత వహించే ఉన్నతస్థాయి నేతలపైనా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో రైతుబంధు(Rythu Bandhu), ఉచిత విద్యుత్(Free Electricity), సాగునీటి సదుపాయాలతో(Irrigation Facilities) పాటు రైతు మరణిస్తే కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయం అందించేలా చర్యలు తీసుకున్నామని హరీష్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా అమలులో నిర్లక్ష్యం పెరిగిందని ఆరోపించారు.
గత ఏడాది ఆగస్టు 14 నుంచి ఎల్ఐసీకి (LIC) చెల్లించాల్సిన ప్రీమియం నిలిచిపోయిందని, దీంతో రాష్ట్రంలో సుమారు 3 వేల మంది రైతుల కుటుంబాలకు బీమా పరిహారం అందలేదని హరీష్ రావు ఆరోపించారు. రైతు బీమా పథకం అమలుకు సుమారు రూ. 1,400 కోట్లు కేటాయించి, అర్హులైన కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధిత కుటుంబాలతో కలిసి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.







