---Advertisement---

జనసంద్రంగా సాగుతున్న జగన్ గుంటూరు పర్యటన

February 4, 2026

Summarize with AI

---Advertisement---

మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) గల్లా మాధవి (Galla Madhavi) ఆధ్వర్యంలో జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా, విచక్షణ కోల్పోయిన టీడీపీ కార్యకర్తలు ఏకంగా ఇంటికి నిప్పుపెట్టడానికి ప్రయత్నించడం గుంటూరు నగరాన్ని (Guntur City) ఒక్కసారిగా ఉల్లిక్కిపడేలా చేసింది. నగరంలో ఎప్పుడూలేని గ్రుహదహనాల కల్చర్‌ను టీడీపీ ప్రవేశపెట్టిందన్న అభిప్రాయం నగరవాసులందరిలో వ్యక్తమవుతోంది.

ఈ నేపధ్యంలో అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరిన జగన్(Jagan) వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు కదలివచ్చారు. వేలాదిగా ఆయన కాన్వాయ్ వెనక అడుగులు వేశారు. సాధారణ ప్రజలు సైతం ర్యాలీలో జగన్ గారి వెంట నడవడం, తెలుగుదేశం చేసిన ఆరాచక రాజకీయాలతో ప్రజలు ఎంత విసిగిపోయారో చెప్పకనే చెబుతోందని అక్కడి వారు మాట్లాడుకోవడం వినిపిస్తుంది.

ఏది ఏమైనా, టీడీపీ నేత భీమినేని వందన (Bheemineni Vandana) అనే నాయకురాలు మరికొంత మందిని తీసుకుని అంబటి గారి ఇంటి వద్ద బూతులతో దాడి చేయడానికి ప్రయత్నించకపోయి ఉండుంటే, అంబటి గారు కూడా మాట తూలే వారు కాదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. దీంతోనే అంబటి గారికి సంఘీభావంగా గుంటూరు ప్రజలు జగన్ గారి వెంట భారీగా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

పోలీస్ ఆంక్షలు ఉన్నప్పటికీ జగన్ వెంట నడుస్తున్న జనసంద్రాన్ని చూసి తెలుగుదేశం వర్గాల్లో కలవరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment